పర్యావరణ పరిరక్షణను మించిన సంపద లేదు
పర్యావరణాన్ని ప్రజలంతా పరిరక్షించాలని సిఎం కెసిఆర్ పిలుపు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ప్రజలందరూ రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణను మించిన సంపద లేదు… ప్రస్తుత కరోనా సమయంలో ఈ విషయం రుజువైంది… స్వచ్ఛమైన ప్రాణ వాయువు దొరక్క పరితపిస్తున్న దుర్భర పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. ఆరోగ్య సంపదను మించిన సంపద లేదని అన్నారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని సిఎం కెసిఆర్ పేర్కాన్నారు.