పవన్ కోసం మళ్లీ రచయితగా త్రివిక్రమ్?

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషనంటే అభిమానులకు పండగే..సహజంగా వాళ్లిద్దరు మంచి మిత్రులన్న విషయం తెలిసిందే.. అయితే పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ చేయబోతున్న ఓ సినిమా కోసం త్రివిక్రమ్ మళ్లీ రచయితగా మారబోతున్నారట. రచనా సహకారం అందించబోతున్నారట. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్టు సమాచారం. ఇక ఇండస్ట్రీ హిట్`అల వైకుంఠపురములో..`తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా గురించి మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. యంగ్ టైగర్ ఎన్టీయార్‌తో సినిమా చేయాలనేది త్రివిక్రమ్ ప్లాన్. కానీ ఎన్టీయార్ `ఆర్ఆర్ఆర్`తో బిజిగా ఉన్నారు. ఎన్టీఆర్ ఫ్రీ అయ్యే వరకు త్రివిక్రమ్ త్రివిక్రమ్ ఓ ప్రాజెక్టు చేయబోతున్నారని తెలిసింది. అదీ పవన్‌కల్యాణ్ చేయబోతున్న ఓ సినిమా కోసం త్రివిక్రమ్ మళ్లీ రచయితగా మారబోతున్నారని సమాచారం.అది కూడా కేవలం రచనా సహకారం. త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం