ప‌సిడి ప్రియుల‌కు షాక్‌!

హైద‌రాబాద్‌: ప‌సిడి ప్రియుల‌కు షాక్‌..! గత కొన్ని రోజులుగా బంగారం ధ‌ర‌లు పెరుగుతూ, తగ్గుతూ వ‌స్తున్నాయి. కాగా తాజా మ‌ళ్లీ బంగారం ధ‌ర‌లు పెరిగాయి. మ‌న దేశంలో బంగారం రేటు పెరుగుతున్న కొనుగోలు చేసేందుకు మాత్రం చాలా వ‌ర‌కు మ‌హిళ‌లు ఆలోచించ‌రు. అందుకే భార‌త్‌లో బంగారానికి ఉన్న డిమాండ్.. ఇష్టం దేనికీ ఉండ‌దు.. కొన్ని రోజులుగా బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పైకి కదలడంతో… బులియన్ మార్కెట్‌లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.370 పెరిగి రూ. 46,900 కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 350 పెరిగి రూ. 43,000 కు చేరింది. అలాగే వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండి ధర రూ. 800 పెరిగి రూ. 71,300 చేరింది.

Leave A Reply

Your email address will not be published.