ఫేక్ ట్విటర్ ఖాతాపై సోనూ ఫైర్!

ముంబయి: ఫేక్ ట్విటర్ ఖాతాపై రియల్ హీరో, నటుడు సోనూసూద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘నా పేరున ఫేక్ ఖాతాను నిర్వహిస్తూ మోసం చేస్తున్నావ్. కచ్చితంగా అరెస్టు అవుతావు మై డియర్. ఇప్పటికైనా చీటింగ్ చేయడం మానుకో. బాగుపడతావ్’ అంటూ సోనూ ఫేక్ ఖాతా నిర్వాహకులను హెచ్చిరిస్తూ ట్విటర్‌లో శుక్రవారం ఓ పోస్టు చేశాడు.
ఇదిలా ఉంటే సోనూ సహాయం కోసం వేచిచూసేవారికి ఈ ఫేక్ ట్విటర్ ఖాతా నిర్వాహకులు గేలం వేస్తున్నారు. అందులో భాగంగానే ఓ బాధితుడికి రెండు ఈ మెయిల్స్ పంపి అతడి వివరాలు పంపించమని కోరారు. ఈ విషయం తెలియడంతో సోనూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.