బాలీవుడ్‌లో 99 శాతం మంది డ్రగ్స్‌ వాడుతున్నారు : కంగనా

ప్ర‌ముఖ భాలీవుడ్ న‌టి కంగనా రనౌత్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. సుశాంత్‌ సింగ్‌ మృతి కేసులో ఇండిస్టీ పెద్దలపై తనదైన మాటలతో విమర్శిస్తూ కంగనా ఈ మ‌ధ్య వార్తల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ విష‌యంలో మీడియాతో కౌంటర్లు.. ప్రతికౌంటర్లతో ప్ర‌త్య‌ర్థుల‌పై దాడి చేస్తోంది. ఈ నేప‌థ్యంలో మరోసారి బాలీవుడ్ ఇండ‌స్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండిస్టీలో 99 శాతం మంది డ్రగ్స్‌ను ఉపయోగిస్తున్నారని పేర్కొంది. డ్రగ్స్‌ను సప్లై చేసేవారిని విచారిస్తే చాలా మంది స్టార్స్‌ జైల్లోనే ఉండాల్సి వస్తుందని పేర్కొన్నారు. అంతే కాకుండా ఓ స్టార్‌ హీరో డ్రగ్స్‌ను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఓసారి అతను ఆస్పత్రి పాలయ్యాడని, అందుచేతనే అతని భార్య అతనికి విడాకులిచ్చిందని చెప్పింది. ఆ సమయంలో తను అతనితో డేటింగ్‌లో ఉన్నానని కూడా చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఇండిస్టీలో తనకు గురువు అని చెప్పుకునే వ్యక్తే తనకు డ్రగ్స్‌ రుచి చూపించారని పేర్కొంది. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ మృతి కేసును ద‌ర్యాప్తు చేస్తున్న సిబిఐ ఆయ‌న ప్రియురాలు రియా చక్రవర్తిని విచారించింది. కాగా రియా డ్రగ్స్‌ సప్లయర్స్‌తో జరిపిన చాటింగ్‌ను సుశాంత్‌ సోదరి బయటపెట్టడంతో రియాకు డ్రగ్స్‌ సప్లయర్స్‌తో సంబంధాలున్నట్లు సిబిఐ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండిస్టీ పెద్దలపై కంగనా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతున్నాయి. చూడాలి సుశాంత్ కేసు ఇంకా ఎన్ని మ‌లుపులు తిరుగ‌త‌దో మ‌రి!

Leave A Reply

Your email address will not be published.