బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌కు కరోనా
ముంబయి: దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కరోనాకు పేద, ధనిక… రాజకీయ నాయకులు, సినిమా స్ఠార్లు, పారిశ్రామక వేత్తలు, పేదవారు అనే తేడా లేదు. ఎవరైనా ఒక్కటే.. దేశంలో అన్ని రంగాలకు చెందిన సెలబ్రిటీలందరూ కరోనా బారీన పడుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బాలీవుడ్ సెలెబ్రిటీలందరూ వరుసగా కరోనా బారిన పడుతున్నారు. టాప్ స్టార్స్ అంతా వరుసగా కరోనా బారిన పడుతుండటంతో బాలీవుడ్లో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే అక్షయ్ కుమార్, ఆమీర్ ఖాన్, రణ్‌బీర్ కపూర్, మలైకా అరోరా, ఆలియా భట్, సంజయ్ లీలా భన్సాలీ, మనోజ్ బాజ్‌పాయ్, దంగల్ నటి ఫాతిమా సనా షేక్ వంటి వారికి కరోనా పాజిటివ్ అని తేలింది… తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా కత్రినా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
”ఇవాళ ఉదయం నాకు కరోనా పాజిటివ్ అని తెలిసింది. స్వల్ప లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్ష చేయించుకున్నాను. వైద్యులు నాకు పాజిటివ్‌గా ధృవీకరించారు. కరోనా ప్రోటోకాల్ ప్రకారం సెల్ఫ్ హోంక్వారంటైన్ అయ్యాను. వైద్యుల సూచనలు పాటిస్తూ ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నాను. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారు కరోనా పరీక్ష చేయించుకోండి. వైద్యుల సలహా మేరకు తదుపరి చర్యలు తీసుకోండి. అందరూ జాగ్రత్తగా ఉండండి. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి మీ ముందుకు వస్తాను.“ అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.