బాస్‌ ఓకే చెప్పారు.. కలలు నిజమయ్యాయి: బండ్లగణేశ్‌

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ హార్డ్‌కోర్‌ ఫ్యాన్స్‌లో బండ్లగణేశ్‌ ఒకరు. పవన్‌ను తన దేవుడిగా ఎప్పుడూ చెప్పుకునే బండ్లగణేశ్‌ ముచ్చటగా మూడోసారి పవన్‌కల్యాణ్‌తో సినిమా చేయబోతున్నారు. ఈ విషయాన్ని బండ్లగణేశ్‌ తన అధికారిక సోషల్‌ మీడియా అకౌంట్స్‌ ద్వారా ప్రకటించారు. ఈ విషయాన్ని సోమవారం ఉదయం బండ్ల గణేష్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. బాస్ ఓకే చెప్పారు. మరోసారి కల నెరవేరుతోంది. ఇందుకు దేవుడు పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు అంటూ ఆయన ట్వీట్ చేశారు
పవన్‌కల్యాణ్‌, బండ్లగణేశ్‌ కాంబినేషన్‌లో ఇది వరకు తీన్‌మార్‌, గబ్బర్‌ సింగ్‌ సినిమాలు రూపొందాయి. వీరి కాంబినేషన్ లో ఎలాంటి సినిమా తెరకెక్కనుంది. ఎవరు డైరెక్ట్‌ చేస్తారు? అనే అంశాలు ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేపుతున్నాయి. 2015లో విడుదలైన టెంపర్‌ సినిమా తర్వాత బండ్లగణేశ్‌ మరో సినిమాను నిర్మించలేదు. దాదాపు ఐదేళ్ల గ్యాప్‌ తర్వాత బండ్లగణేశ్‌ నిర్మించే చిత్రమిదే అవుతుంది.

“నా బాస్‌ ఓకే చెప్పారు. మరోసారి ఆయనతో కలిసి పనిచేయబోతున్నాను. నా నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ ఆయనతో చేస్తున్నాను. నా కలలు నిజమయ్యాయి. నా దేవుడు పవన్‌కల్యాణ్‌కు ధన్యవాదాలు” అని మెసేజ్‌తో పాటు పవన్‌కల్యాణ్‌తో ఉన్న ఫొటోను షేర్‌ చేశారు బండ్లగణేశ్. దీంతో వీరిద్దరి క్రేజీ కాంబినేషన్‌లో ‘గబ్బర్ సింగ్’ లాంటి మరో బ్లాక్ బస్టర్ సిద్ధం కానుందంటూ పండుగ చేసుకుంటున్న అభిమానులు ఆ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. దీనిపై అధికారికంగా వివరాలు ప్రకటించాల్సి ఉంది.

 

 

Leave A Reply

Your email address will not be published.