బిగ్‌బాస్ సీజన్-4 విజేత అభిజిత్

హైదరాబాద్: బిగ్‌బాస్ తెలుగు సీజన్-4 టైటిల్, ప్రైజ్ మనీని ఎవరూ గెలుచుకుంటారని ఆసక్తిగా 105 రోజులకు పైగావెయిట్ చేస్తున్న ప్రేక్షకులకు క్లారిటీ వచ్చింది. ఫైనల్‌కు చేరుకున్న టాప్ 5 కంటెస్టెంట్స్ లో దేత్తడి హారిక, అరియానా, సోహైల్ బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మిగిలిన టాప్ 2 కంటెస్టంట్స్ లో అభిజిత్ టైటిల్ ను గెలుచుకున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా బిగ్‌బాస్ టైటిల్‌ను అభిజీత్ అందుకున్నాడు. అఖిల్ రన్నరప్‌గా నిలిచాడు. అభిజిత్, అఖిల్ మీరు మీ జీవితంలో మరింత ఎదగాలని కోరుకుంటున్నట్టు బిగ్‌బాస్ చెప్పాడు. సొహైల్ మూడు, అరియానా నాలుగు, హారిక ఐదో స్థానంలో నిలిచారు. బిగ్‌బాస్ ట్రోఫీ ఇచ్చేందుకు చిరంజీవి ప్రత్యేక అతిథిగా విచ్చేశారు.
The Gangleader #Megastar @KChiruTweets is back on stage again for #BBTeluguGrandFinale #BiggBossTelugu4 pic.twitter.com/2thYqnw3Fa
— starmaa (@StarMaa) December 20, 2020