బిహార్‌లో ఎన్నికలు నిర్వహించనున్న ఈసీ!

బిహార్‌లో ఎన్నికలు నిర్వహించనున్న ఈసీ!

న్యూఢిల్లీ: బిహార్‌లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నికలను నిర్వహించాలని ఈసీ సూత్ర ప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కోవిడ్‌ రోగులకు ప్రత్యేకమైన పోలింగ్‌ బూత్‌లను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ర్యాలీలు, బహిరంగ సభల నిమిత్తమై కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది. ర్యాలీలు, బహిరంగ ప్రదేశాల సమయంలో భౌతిక దూరం పాటిస్తూనే… ”ప్రత్యేకంగా మార్కింగ్‌” చేయాలని కూడా ఈసీ నిశ్చయించుకుంది. వీటితో పాటు ప్రస్తుతమున్న పోలింగ్‌ స్టేషన్‌ల కంటే మరో 50 శాతం పోలింగ్‌ స్టేషన్‌ల సంఖ్యను కూడా పెంచనుంది. రాబోయే ఎన్నికల నిమిత్తమై ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేయడమే కాకుండా సెప్టెంబర్‌ 20 నాడు ఎన్నికల షెడ్యూల్‌ను కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం. రెండు లేదా మూడు దశల్లో బిహార్‌ ఎన్నికలను నిర్వహించడానికి ఈసీ సిద్ధమైపోయినట్లు తెలుస్తోంది. బిహార్‌లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నికలను నిర్వహించాలని ఈసీ సూత్ర ప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
బిహార్ ఎన్నికల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రత్యేకంగా సమావేశం కానుంది.
వివిధ రాజకీయ పార్టీలు, వివిధ ప్రాంతాల చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారుల నుంచి సలహాలు, సూచనలు కూడా ఈసీ కోరనుంది. ఈ సలహాలను పరిగణనలోకి తీసుకునే మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు లేదా మూడు దశల్లో బిహార్ ఎన్నికలను నిర్వహించడానికి ఈసీ సిద్ధమైపోయినట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.