బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత

విజయవాడ: ప్రకాశం బ్యారేజ్ వద్ద వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. కృష్ణానదిలోకి ఎగువ ప్రాంతాల వాగుల నుంచి వరదనీటితోపాటు పులిచింతల నుంచి కూడా వరద నీరు వస్తోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద 2 లక్షల 80వేల క్కుసేకుల ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2 లక్షల 70 వేల క్యూసెక్కులు గా ఉంది. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి 3 లక్షల 30 వేల క్యూసెక్కుల నీరు చేరింది. నేటి సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్ృకి మరింత పెరిగే చేరే అవకాశం ఉంది.
12 అడుగుల పూర్తీ స్థాయి నీటి మట్టంతో ప్రకాశం బ్యారేజ్ నిండుకుండలా ఉన్నది. దీంతో అధికారలు బ్యారేజీ 70 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఈస్టర్న్ ,వెస్ట్రన్ కెనాల్స్ ద్వారా 10,356 క్యూసెక్కులు నీటి విడుదల చేశారు. నదీ పరీవాహక లోతట్టు ప్రాంతంలోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. గంట గంటకు పెరుగుతున్న వరద ప్రవాహం పెరుగుతోంది.
లోతట్టు ప్రాంత ప్రజలకు హెచ్చరిక..
కృష్ణానది పరివాహక ప్రాంతాలైన రణదివినగర్, భూపేష్ గుప్తా నగర్, తారకరామనగర్, భవానీపురం, విద్యాధపురం మొదలగు ప్రాంతాల ప్రజలని అప్రమత్తం చేశారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ విజ్ఞప్తి చేశారు.