బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం

ఢిల్లీ: బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం అయ్యింది. ఇండియన్ నేవీ ఆదివారం ఈ ప్రయోగం జరిపింది. ఈ క్షిప‌ణిని భారత రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) అభివృద్ధి చేసిన బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణిని ఇండియన్ నేవీ విజయవంతంగా పరీక్షించింది. దేశీయంగా నిర్మించిన స్టీల్త్ డిస్ట్రాయర్‌ INS చెన్నై యుద్ధ నౌక నుంచి ఆదివారం ఈ ప్రయోగం చేపట్టారు. అరేబియా మహాసముద్రంలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి అత్యంత కచ్చితత్వంతో ఛేదించినట్లు డీఆర్‌డీఓ ప్రకటించింది.
అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో జరిపిన ప్రయోగంలో గురితప్పకుండా లక్ష్యాన్ని చేధించిందని ప్రకటనలో తెలిపిింది. సుదూరంలోని ఉపరితల లక్ష్యాలను బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ చేధిస్తుందని డీఆర్డీఓ తెలిపింది. ఈ ఆయుధంతో ఇండియన్ నేవీ బలం మరింత పెరిగిందని.. ప్రధాన ఆయుధంగా సేవలు అందించగలదని పేర్కొంది. ప్రయోగం విజయవంతమైన సందర్భంగా డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ జి. సతీశ్ రెడ్డిని, శాస్త్రవేత్తలను, డీఆర్డిఓ, బ్రహ్మోస్, ఇండియన్ నేవీ సిబ్బందిని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందించారు.

బహ్రోస్ క్షిప‌ణుల సామ‌ర్థ్యం పెంచేందుకు డిఆర్‌డిఒ ప్ర‌యోగాలు చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. బహ్రోస్ క్షిప‌ణుల దాదాపు 400 కీలోమీట‌ర్ల దూరంలోని ల‌క్ష్యాల‌ను కూడా సులువుగా చేధించ‌గ‌ల‌వు. మ‌రోవైపు ఇవాళ ప్ర‌యోగానికి సంబంధించిన ఐఎన్ఎస్ చెన్నై 2016 నుంచి త‌న సేవ‌లు అందిస్తోంది. ఇండియ‌న్ నేవీ ప్రాజెక్టు 15 ఎలో భాగంగా స్వ‌దేశీయంగా దీనిని అభివృద్ధి చేశారు.

 

Leave A Reply

Your email address will not be published.