బడులు తెరిచేందుకు మరింత సమయం
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్: కరోనా వైరస్ ప్రభావం విద్యారంగంపై తీవ్రంగా పడింది. ఈ వైరస్ వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా బడులు తెరుచుకోలేదు.. విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా మార్చి 16 నుంచి పాఠశాలలను మూసివేయడం జరిగింది అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పాఠశాలల ప్రారంభం, ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. లాక్‌డౌన్ సమయంలో పరీక్షల నిర్వహణపై కూడా ఆందోళన కూడా నెలకొంది. సీఎం చొరవ తీసుకుని అన్ని తరగతుల విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేశామన్నారు. పదో తరగతి విద్యార్థులందరినీ పాస్ చేశామన్నారు. విద్యా సంస్థలు తెరిచేందుకు మరికొంత సమయం పట్టనుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు పాఠశాలలు తెరుస్తామని స్పష్టం చేశారు.
ఇక పోతే విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు ఆన్‌లైన్ క్లాసుల కోసం భారీ ప్రణాళికలు తయారు చేసినట్లు తెలిపారు. విద్యార్థులందరికీ ఉచితంగా బుక్స్‌ను పంపిణీ చేశామని తెలిపారు. విద్యాశాఖ తరపున మూడు రకాల సర్వే చేశామని చెప్పారు. రాష్ర్టంలో 85 శాతం మంది విద్యార్థుల నివాసాల్లో టీవీ ఉందని సర్వేలో తేలిందన్నారు. సర్వే ప్రకారం 40 శాతం విద్యార్థుల ఇళ్లల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయన్నారు. టీవీ, స్మార్ట్ ఫోన్లు లేని వారిని పక్కవారితో అనుసంధానం చేశామని తెలిపారు. దూరదర్శన్, టీ శాట్ యాప్‌లో డిజిటల్ క్లాసులు అందుబాటులో ఉంచామన్నారు. విద్యార్థులందరూ ఆన్‌లైన్ క్లాసులు వింటున్నారని మంత్రి తెలిపారు. 48 వేల వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ఆన్‌లైన్ బోధనను అందిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రైవేటు పాఠశాలల ఫీజు వసూలుపై మంత్రి ఫైర్
మంత్రి ఫైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు పైకూడా స్పందించారు. ఎవరైన నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు, ఇతరాత్ర వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని యాజమాన్యాలను హెచ్చరించారు. అత్యధిక ఫీజులు వసూలు చేయొద్దని సీఎం కేసీఆర్ గట్టిగా చెప్పారని గుర్తు చేశారు. ప్రైవేటు యాజమాన్యాలు నిబంధనలు పాఠించాలని.. ఎలాంటి దోపీడీలకు పాల్లడవద్దని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.