బరువు తగ్గడానికి వెల్లుల్లి!

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యలేదు అంటూ వెల్లుల్లిని కొనియాడని వారు లేరు. అనాదిగా వెల్లుల్లి ఆహార పదార్థంగాను, ఔషధంగాను ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉంది. భారతదేశంలో అనాది నుండీ నేటివరకు ఆదరణలో ఉన్న సిద్ధ, ఆయుర్వేదం, యునానీ వైద్యాలలో వెల్లుల్లి ఔషధ విలువల్ని గుర్తించి వాడుతున్నారు. వైద్య పరంగా వెల్లుల్లి అనేక రుగ్మతలకి దివ్యౌషధంగా వినియోగపడుతుంది. గుండెజబ్బులకి దీన్ని మించిన ఔషధం లేదంటే అతిశయోక్తి కాదు.
రక్తాన్ని శుద్ధిచేసే గుణం:
అధిక రక్తపోటుని వివారించడంలో వెల్లుల్లి ఎంతగానో ఉప యోగపడుతుంది. ఇందులో లభ్యమయ్యే హైడ్రోజన్ సల్ఫేట్, నైట్రిక యాసిడ్ రక్తనాళాల ఉపశమనానికి ఎంతగానో దోహదపడతాయి. ఒక వెల్లుల్లి పాయ తిని, రాగిచెంబులో నీరు సాధ్యమైనంత ఎక్కువ తాగితే రక్తంలోని వ్యర్ధ పదార్ధాలు మూత్రం ద్వారా బయటకు పంపబడతాయి.
జీర్ణక్రియకు:
వెల్లుల్లి తీసుకోడం వలన జీర్ణశక్తి వృద్ధిచెంది మంచి ఆకలి పుడుతుంది. ప్రతి నిత్యం పరగడుపున 2, 3 వెల్లుల్లి రేకలు తినడం వలన ఉదరసంబంధ వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. 3 వెల్లుల్లి పాయలను పాలతో మరగబెట్టి పడుకునే ముందు రాత్రిపూట సేవిస్తే ఉబ్బసం తగ్గిపోతుంది.
బరువుతగ్గడాయికి:
మనం తినే ఆహారంలో వెల్లుల్లి చేర్చి తింటే మనలో ఎక్కువగా ఉండే కొలెస్టిరాల్ తగ్గిపోతుంది సగం నిమ్మకాయ రసంలో కొంచెం వేడి నీళ్లు కలిపి అందులో రెండు వేల్లుల్లిపాయల రసం కలిపి ఉదయము, సాయంత్రం తీసుకుంటే క్రమముగా ఒళ్ళు తగ్గుతుంది . ఈ సమయంలో కొవ్వుపదార్ధాలు తినడం, పగటి నిద్ర మానేయాలి . . . కొంచెం వ్యాయాయం చేయాలి
వెల్లుల్లి అల్లంతో కలిపి తింటూవుంటే ఎటువంటి ఎలర్జీలు దరిచేరవు. వెల్లుల్లిలో విటమిన్ ‘సి’ అత్యంత అధికంగా ఉండడం వల్ల నోటి వ్యాధులకి దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది.
అంతేకాక ఉబ్బసం, జ్వరం, కడు పులో నులిపురుగుల నివారణకి, లివర్ (కాలేయం) వ్యాధులకీ చక్కటి ఔషధంగా వెల్లుల్లి ఉపయోగపడుతుంది.
వారానికి 5 వెల్లుల్లిపాయలు పచ్చివి తిన్నా, పండినవి తిన్నా కేన్సర్ వ్యాధిని 40 నుంచి 50 శాతం వరకూ నిర్మూలిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే వెల్లుల్లి సర్వరోగనివారిణి అనే అనవచ్చు.
లుకోడెర్మా, ఊపిరితిత్తుల క్షయ వ్యాధికి, న్యూవెూనియాకి, కుష్ఠు వ్యాధులకు కూడా ఇది అవెూఘంగా పనిచేస్తుంది.
ఇంత విలువైన ఔషధ గుణాలున్న వెల్లుల్లి మనం నిత్యం వాడుతున్నప్పటికీ, దీని విలువ తెలుసుకుని మరింత వినియోగించు కుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు.
మనలో చాలా మందికి తరచుగా జలుబు, ముక్కు దిబ్బడ, జ్వరం వస్తు ఉంటాయి …. వారు వెల్లుల్లి రోజు ఆహారంలో తీసుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరిగి తరచుగా రావడాన్ని తగ్గిస్తుంది . అర చెంచా నేతిలో వేయించియన రెండు వెల్లుల్లి పాయలను క్రమం తప్పకుండా రోజూ తినాలి
ముఖం, శరీరం వర్చస్సు ఆకర్షణీయంగా ఉండాలంటే రెండు వెల్లుల్లి పాయల రసం అరగ్లాసు గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకోండి. దీనివల్ల రక్తం శుభ్రపడి దేహకాంతి పెరుగుతుంది. అపుడు చాక్లెట్లు, మసాలా వస్తువులు తినకూడదు .
అర్ధ రాత్రి చెవిపోటు వస్తే … డాక్టర్, మందులు దొరకవు కావున వేడిచేసిన వెల్లుల్లి రసం గోరువెచ్చగా ఉన్నప్పుడు నాలుగు చుక్కలు వేయండి చెవి నొప్పి తగ్గిపోతుంది .
గర్భిణిగా ఉన్నప్పుడు రోజూ ఒక వెల్లుల్లి పాలతో తీసుకుంటే కడుపులో బిడ్డ బలంగా ఎదుగుతుంది . రోజూ రెండు వెల్లుల్లి పాయలను కాన్సర్ ఉన్నావారు తీసుకుంటే కాన్సెర్ కణాలు తిరిగి గడ్డకట్టడం దూరమువుతుంది . మోకాళ్ళు నొప్పులు ఉన్నవారు వెల్లుల్లి రసం ఎనిమిది చుక్కలు అరగ్లాసు నీటిలో కలిపి రోజూ తీసుకుంటే కొన్నాళ్ళకు నొప్పులు తగ్గిపోతాయి .
జాగ్రత్తలు :
వెల్లుల్లిలో సల్ఫర్ ఎక్కువగా ఉన్నందున చిన్న పిల్లలకు తాక్కువ మోతాదులో వాడాలి . ఎక్కువైతే గాబరా పడతారు వెల్లుల్లి గాటుగా ఉంటుంది .. కొత్నమందికి కడుపులో మంట పుడుతుంది . వెల్లుల్లి కొంతమందికి పడదు .. ఎలర్జీ వస్తుంది, దురదలు, తలనొప్పి, ఆయాసం వస్తాయి . వీళ్ళు వెల్లుల్లి తినరాదు . ఆస్తమా ఉన్నవారు వెల్లుల్లి అస్సలు వాడకూడదు .
-పూర్ణిమ
Iam also weight loss ,garlic is very useful to our body.