India Corona సంక్షోభానికి టీకానే దీర్ఘకాలిక పరిష్కారం: ఫౌచీ

వాషింగ్టన్(CLiC2NEWS): దేశప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్లు ఇవ్వడమే భారత్‌లోని ప్రస్తుత కొవిడ్ విజృంభణకు దీర్ఘకాలిక పరిష్కారమని అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు డా. అంధోనీ ఫౌచీ అన్నారు. ఫౌచీ ఎబిసి న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ పోరులో దేశీయంగా, అంతర్జాతీయంగా కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచాలని పిలుపునిచ్చారు. ‘ కరోనాకు స్వస్తి పలకాలంటే..ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడమొక్కటే మార్గం. ప్రపంచంలో టీకాలను ఉత్పత్తి చేసే అతిపెద్ద దేశం భారత్. ఆ దేశ వనరులను అది పెంపొందించుకోవాలి. కేవలం దేశీయంగా, ప్రపంచ వ్యాప్తంగా టీకాల ఉత్పత్తిని వేగవంతం చేయాలని ఆయన సూచించారు..“
భారత్‌కు సరఫరా చేసేలా ఇతర దేశాలు తమ సొంత టీకాలు తయారు చేయడం, ఉత్పత్తి పెంచాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. దానికి ఒకటే మార్గముందని, టీకాలు తయారు చేసే కంపెనీలను కలిగి ఉండాలని, దీని ద్వారా మిలియన్ డోసులు ఉత్పత్తి చేయగలగాలని పేర్కొన్నారు.
కరోనా కట్టడి చేయగలిగాలంటే గత ఏడాది చైనా అవలంభించిన విధానాలను భారత్ ఇప్పుడు అమలు చేయాలని సూచించారు. ఏడాది క్రితం చైనా నిర్మించినట్లుగా…భారత్ కూడా వెంటనే క్షేత్ర స్థాయి ఆసుపత్రులు (ఫీల్డ్ ఆసుపత్రులు) నిర్మించాలని ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. దీన్ని అమలు చేయాలని, ఆసుపత్రుల్లో బెడ్స్ లేకపోతే….కరోనా బాధితులను రోడ్డున పడేయలేరని, ప్రస్తుతం ప్రజలకు ఆక్సిజన్ దొరకని పరిస్థితులు రావడం శోఛనీయమని అన్నారు. భారత్‌లో బెడ్స్, ఆక్సిజన్, పిపిఇ కిట్ల కొరతతో పాటు ఇతర ఆరోగ్య పరికరాల సమస్య ఉందని పేర్కొన్నారు.
భారత్ తక్షణమే దృష్టి సారించాల్సిన అంశాలు కూడా ఉన్నాయని ఫౌచీ స్పష్టం చేశారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం లాక్‌డౌన్‌లు విధించడం వంటి అంశాలను ఆయన పునురుద్ఘాటించారు. గతంలో కూడా ఇటువంటి సూచనలే భారత్ చేశానని… ఆ దేశం కూడా అమలు చేసిందని అన్నారు. భారత్‌లోని పలు రాష్ట్రాలు కూడా లాక్‌డౌన్, కర్ఫ్యూలు వంటివి పెట్టాయని, అదే సమయంలో కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలని తెలిపారు.