భారీ కాన్వాయ్ తో హుజూరాబాద్‌కు ఈటల?

హైదరాబాద్(CLiC2NEWS): మంత్రిగా కేబినెట్ నుండి ఉద్వాసనకు గురైన ఈటల రాజేందర్ తన సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్ కు బయలుదేరారు. హైదరాబాద్‌లోని శామీర్‌పేటలోని తన నివాసం నుంచి భారీ కాన్వాయ్‌తో తన సొంత నియోజకవర్గానికి బయలుదేరారు. భారీ సంఖ్యలో కార్లతో అనుచరులు, మద్దతుదారులు ఆయన వాహానాన్ని అనుసరించారు. దీంతో రహదారి వెంబడి కోలాహల వాతావరణం నెలకొంది. సిద్దిపేటలోని రంగధాంపల్లి చౌరస్తాలో ఈటల అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. హుజురాబాద్ కు చేరుకుని తన అనుచరులు, కార్యకర్తలతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నారు.
ప్రజల దగ్గరికి… ప్రజా నాయకుడు..✊ https://t.co/LeKYn3NSna
— Eatala Rajender (@Eatala_Rajender) May 3, 2021