భారత్లో కొత్తగా 11,831 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్లో కొత్తగా 11,831 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో వైరస్ వల్ల 84 మంది మరణించారని బులిటెన్లో పేర్కొన్నారు. కాగా తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,38,194కు చేరింది. ఇందులో 1,05,34,505 మంది బాధితులు మహమ్మారి బారినుంచి కోలుకోగా, 1,55,080 మంది మరణించారు. మరో 1,48,609 మంది చికిత్స పొందుతున్నారు. మరో 11,904 మంది కోలుకున్నారని బులిటెన్లో పేర్కొంది.