భూమిని చదును చేస్తుంటే దొరికిన లంకెబిందెలు
జనగామా: జనగామా జిల్లా పెంబర్తి గ్రామంలో గురువారం బంగారం బిందె అభ్యమయింది. రెవెన్యూ, పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్కు చెందిన నర్సింహ పెంబర్తి గ్రామ పరిధిలో వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారికి సమీపంలో 11 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. ఆ భూమిలో వెంచర్ ఏర్పాటు కోసం జెసిబితో భూమిని చదును చేస్తుండగా లంకె బిందె కనిపించింది.
వెంటనే భూ యజమాని నర్సింహ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు బెంది తెరిచి చూడగా అందులో 17 తులాల బంగారం, 10 కిలోల వెండి లభ్యమైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
