మంచిర్యాల‌లో క‌రోనాతో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి..

మంచిర్యాల : మహమ్మారి కరోనా ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కాగా మంచిర్యాలలో ఒకే కుటుంబంలో ముగ్గురు కోవిడ్‌-19కు బలైపోయారు. మంచిర్యాలలో ప్రముఖ వ్యాపారి కుటుంబంపై మహమ్మారి పగబట్టింది. 20 రోజుల వ్యవధిలోనే తండ్రి- ఇద్దరు కొడుకుల ప్రాణాలను బలిగొంది. కరోనాతో ముగ్గురూ మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు అంతులేని విషాదంలో మునిగిపోయారు. వైద్యానికి కార్పొరేట్ ఆసుపత్రిలో రూ.1.30 కోట్లు ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలానికి చెందిన ఒక వ్యాపారికి నలుగురు కుమారులు. మూడో కుమారుడు 20 ఏళ్ల క్రితమే చనిపోయాడు. తరువాత మంచిర్యాలలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వ్యాపారి ప‌ట్ట‌ణంలోనే నక్షత్ర ఇంజనీరింగ్‌ పేరుతో ఓ షాప్‌ నడుపుతున్నాడు. ముగ్గురు కొడుకులకు పెళ్లిళ్లు జ‌రిగినా అందురూ కలిసి ఉమ్మడిగా క‌లిసి జీవ‌నం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా, గత ఆగ‌స్టు నెలలో వ్యాపారితో పాటు రెండో కుమారుడికి, పిల్లలకు కరోనా వైర‌స్ సోకింది. ఇద్దరూ హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరగా.. పిల్లలు ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండి కోలుకున్నారు. ఆగస్టు 22న వ్యాపారి ఆరోగ్య పరిస్థితి క్షీణించి మ‌ర‌ణించాడు. ఆయ‌న మరో కుమారుడికి కూడా కోవిడ్ మ‌హ‌మ్మారి ఫాజిటీవ్ రావ‌డంతో హైదరాబాద్‌లో రెండు కుమారుడు చికిత్స పొందుతున్న ఆసుప‌త్రిలో చేరాడు. అయినా పరిస్థితి మిషమించి ఆయ‌న సెప్టెంబర్‌ 4న మరణించాడు. కుటంబంలో ఇద్దరిని కోల్పోయిన విషాదం నుంచి కోలుకోకముందే సెప్టెంబర్‌ 5న రెండో కుమారుడు కూడా మరణించాడు. దాంతో ఆ కుటుంబం శోక‌సంద్రంలో మునిగిపోయింది. ఇక పోతే చ‌నిపోయిన ఈ ముగ్గురి వైద్యం కోసం ఏకంగా రూ.1.30 కోట్లు ఖ‌ర్చు చేశారు. కార్పోరేట్ ఆసుప‌త్రిలో ఇంత భారీగా సొమ్ములు ఖ‌ర్చు చేసినా… ఒకే కుటుంబంలో ముగ్గురు వ్య‌క్తులు చ‌నిపోవ‌డంతో బంధుమిత్రులు ఆవేద‌న చెందుతున్నారు. ఈ వార్త మంచిర్యాల ప‌ట్ట‌ణంలో ప‌లువురిని క‌ల‌చివేస్తోంది.

Leave A Reply

Your email address will not be published.