మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా నేడు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభం
హైదరాబాద్: కోట్లాది రూపాయలను ఖర్చు చేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పేదల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని వనస్థలిపురం రైతు బజార్ వద్ద రెండు ఎకరాల విస్తీర్ణంలో మూడు బ్లాక్ లలో 324 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించారు. ఈ ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.28.02 కోట్లు ఖర్చు చేసింది. ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఈరోజు మంత్రి కేటీఆర్ ప్రారంభించబోతున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు మంత్రి కేటీఆర్ వీటిని ప్రారంభించి లబ్దిదారులకు అందజేస్తారు.