మరోమారు గొప్ప మ‌న‌సు చాటుకున్న సచిన్‌

ముంబయి: దేశంలో ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు స‌చిన్‌.. ఈ క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ మరోమారు త‌న గొప్ప‌మ‌న‌సును చాటుకున్నారు. వివిధ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు ఆయన ఓ సేవాసంస్థ ద్వారా వైద్యసహాయాన్ని అందించనున్నారు. ఆరు రాష్ట్రాలకు చెందిన 100 మంది చిన్నారులు ఈ సాయాన్ని పొందనున్నారు. ఇ-కామ్‌ ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో మహారాష్ట్ర, అసోం, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ప్రభుత్వ, ట్రస్టు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారులకు అందించనున్నారు. దీనిపై ఇ-కామ్‌ ఫౌండేషన్‌ స్పందిస్తూ.. చిన్నారులకు వైద్యసాయం అందించడానికి టెండుల్కర్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడమే తమ లక్ష్యమన్నారు. ఈ నెల ఆరంభంలో అసోంలోని కరీంగంజ్‌ జిల్లాలో మకుంద ఆస్పత్రిలో పిల్లల అత్యవసర విభాగానికి ఆయన పరికరాలు అందించారు. యూనిసెఫ్‌కు టెండుల్కర్‌ సౌహార్ద్ర రాయబారిగా ఉన్న విషయం విధితమే.

Leave A Reply

Your email address will not be published.