మల్కాజ్గిరి ఏసీపీ ఇంట్లో సోదాలు
వెలుగు చూసిన 50 కోట్ల అక్రమాస్తులు.!
హైదరాబాద్ : మల్కాస్గిరి ఏసీబీ నరసింహారెడ్డి నివాసంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలతో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఏసీపీ నివాసంతో పాటు ఆయన బంధువుల నివాసాల్లో ఏకకాలంలో 12 చోట్ల అధికారులు సోదాలు చేస్తున్నారు. గతంలో ఉప్పల్ సీఐగా నర్సింహారెడ్డి పని చేశారు. అయితే ఆయన అనేక భూతగాదాల్లో తలదూర్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏసీపీ నర్సింహారెడ్డి రూ. 50 కోట్ల అక్రమాస్తులు సంపాదించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మాజీ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అల్లుడు నర్సింహారెడ్డి. హైదరాబాద్లోని మహేంద్రహిల్స్, డీడీ కాలనీ, అంబర్పేట, ఉప్పల్, వరంగల్లో 3 చోట్ల, కరీంనగర్లో 2 చోట్, నల్లగొండలో 2 చోట్ల, అనంతపూర్లో మొత్తంగా హైదరాబాద్లో 20చోట్ల ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక ఒకే సమయంలో ఏసీబీ అధికారులు 34 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
