మళ్లీ ఎయిమ్స్‌లో చేరిన అమిత్‌షా

న్యూఢిల్లీ : ఇటీవల కరోనా నుండి కోలుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మరోమారు అనారోగ్యం బారినపడ్డారు. శనివారం రాత్రి సుమారు 11 గంటలకు షా ఎయిమ్స్‌లోని కార్డియో న్యూరో టవర్‌లో అడ్మిట్ అయ్యారు. కరోనా నుండి కోలుకున్నప్పటికీ..శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. దీనికిముందు కూడా ఆయన ఢిల్లీలోని పోస్ట్ కోవిడ్ ట్రీట్‌మెంట్ కోసం ఎయిమ్స్‌లో చేరారు. ఆగస్టు 31న డిశ్చార్జ్ అయ్యారు. కాగా అమిత్ షా ఆగస్టు 2న కరోనా పాజిటివ్‌గా తేలడంతో గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం ఆగస్టు 14న అమిత్‌షాకు కరోనా నెగిటివ్ రిపోర్టు వచ్చింది. తిరిగి 4 రోజుల్లో ఆగస్టు 18న పోస్ట్- కోవిడ్ కేర్ కోసం తిరిగి ఎయిమ్స్‌లో చేరారు. కాగా అక్కడి నుండే తన మంత్రిత్వ శాఖ వ్యవహారాలను నిర్వహించారు.