మహిళా ఉద్యోగులకు గుడ్‌న్యూస్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సర్కార్ మహిళా ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకనుంచి గర్భిణీ ఉద్యోగులు కాలేజీకి వెళ్లకుండా ఇంటినుంచే విధులు నిర్వర్తించవచ్చని ఈ మేరకు ఇంటర్ విద్య కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. గర్భిణీ ఉద్యోగులు కొవిడ్ నేపథ్యంలో కాలేజీలకు వెళ్లడం వల్ల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, మహిళా ఉద్యోగులు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ దృష్టికి తీసుకొచ్చారు. గర్భిణీ ఉద్యోగుల ఈ సమస్యను పరిశీలించాల్సిందిగా ఇంటర్ విద్యా కమిషనర్‌కు ప్రతిపాదించడంతో ఇంటర్ విద్య కమిషనర్ మహిళా ఉద్యోగులు కాలేజీకి రాకుండానే ఇంటినుంచి విధులు నిర్వర్తించేందుకు అంగీకరిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.