మహేశ్వరంలో `నార‌ప్ప‌` షూటింగ్ సందడి!

కరోనా జాగ్రత్తలతో షూటింగ్ షురూ..

మ‌హేశ్వ‌రం: కరోనా విజృంభణ, లాక్‌డౌన్ నేపథ్యంలో గత ఎనిమిది నెలలుగా ఇంటికే పరిమితమైన నటీనటులంతా ఒక్కొక్కరుగా సెట్స్ పైకి వస్తున్నారు. షూటింగ్ రీ ఓపెన్ చేసుకునేందుకు పర్మిషన్స్ రావడంతో స్టార్ హీరోలు కూడా తమ తమ లేటెస్ట్ ప్రాజెక్ట్స్ ఫినిష్ చేసేందుకు ముందుకొస్తున్నారు. తాజాగా విక్టరీ వెంకటేష్ తన తాజా సినిమా `నార‌ప్ప` షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న ఈ భారీ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యింది. మహేశ్వరం మండల కేంద్రంలో గల పురాతన అక్కన్న మాదన్న గడికోటలో నారప్ప‌ సినిమా చిత్ర సన్నివేశలను చిత్రించారు. హీరో విక్టరీ వెంకటేష్ మరియు ప్రియమణి, త‌దిత‌ర న‌టీన‌టులు ఇక్క‌డ జ‌రిగిన షూటింగ్ లో పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.