మిథాలిరాజ్ బయోపిక్.. డైరెక్టర్ చేంజ్?

టీమిండియా మహిళా క్రికెట్ జట్టు లెజెండ్ మిథాలిరాజ్ జీవితకథ ఆధారంగా బయోపిక్ “శభాష్ మిథు” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో తాప్సి టైటిల్ రోల్ పోషిస్తోంది. ఇప్పటికే తాప్సీ క్రికెట్‌లో కూడా మెలకువలు నేర్చుకుంది ఈ సినిమా కోసం. ఈ బయోపిక్ లో మిథాలీ రాజ్ జీవితంలో జరిగిన అనేక సంఘటనలను, క్రికెట్ కెరీర్‌లో సాధించిన హిస్టరీని ఇందులో చూపించనున్నారు. అయితే వయాకామ్ 18 స్టూడియోస్ బ్యానర్ రూపొందుతున్న ఈ చిత్రానికి తాజాగా డైరెక్టర్ ను మార్పు చేస్తున్నారట. మొదట రాహుల్ ధోలాకియా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆయన స్థానంలో దర్శకుడిగా శ్రీజిత్ ముఖర్జీ అడుగు పెట్టారు. శ్రీజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది.
అయితే ఈ మార్పుకు కారణమేంటో తెలియరాలేదు. శభాష్ మిథు టీం త్వరలోనే సెట్స్ లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతోంది. మిథాలిరాజ్ తన క్రికెట్ కెరీర్ లో ఎదుర్కొన్న సంఘటనలు, మైలురాళ్లను బయోపిక్‌లో చూపించబోతున్నారు. కాగా మరోవైపు తాప్సి నటించిన ‘హసీన్ దిల్ రుబా, రశ్మి రాకెట్’ చిత్రాలు ఓటిటి విడుదలకు సిద్ధం అవుతున్నాయి.