మీ వాట్సప్ నుంచి డబ్బులు పంపడం ఈజీ..

దేశీయంగా డిజిటల్‌ చెల్లింపు సేవలు ప్రారంభం

న్యూఢిల్లీ: వాట్సాప్ వినియోగదారులకుపెద్ద గుడ్ న్యూస్. ఇక ముందు వాట్సాప్ ద్వారా కూడా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు. ఈ సేవ‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం అనుమతి వచ్చిన విషయంను ఫేస్‌బుక్ సీఈవో జుక‌ర్‌బ‌ర్గ్ ఈ ప్ర‌క‌టించారు. వాట్సాప్‌లో డిజిట‌ల్ చెల్లింపులు అందుబాటులోకి తెచ్చిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. దీంతో నేటి నుంచి వాట్స‌ప్‌లో సుర‌క్షితంగా పేమెంట్స్ చేసుకోవ‌చ్చు అని తెలిపారు. ఈ అవకాశాన్ని వాట్సప్ వినియోగ‌దారులంద‌రికీ డిజిట‌ల్ చెల్లింపులు అందుబాటులోకి రానున్నాయి. ‌వాట్సప్ ద్వారా చేసే చెల్లింపుల‌కు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవ‌స‌రం లేద‌ని జుక‌ర్ బ‌ర్గ్ స్ప‌ష్టం చేశారు. అత్యంత పార‌ద‌ర్శ‌కంగా, సుర‌క్షితంగా ఈ సేవ‌ల‌ను అందుబాటులోకి తెచ్చామ‌న్నారు.

నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) నుంచి అనుమతులు అందుకున్న నేపథ్యంలో దేశంలో పేమెంట్స్‌ సర్వీసులను మొదలు పెట్టినట్లు శుక్రవారం వాట్సప్‌ తెలియజేసింది. దేశీయంగా 2018లోనే యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ఆధారిత పేమెంట్స్‌ సర్వీస్‌ను వాట్సప్‌ పరీక్షించడం మొదలు పెట్టింది. సుమారు 10 లక్షల వినియోగదారులతో ఈ ప్రక్రియ కొనసాగగా, ఎట్టకేలకు గురువారం యూపీఐ ఆధారిత సేవలకు ఎన్‌పీసీఐ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

ఐదు బ్యాంకులతో టైఅప్‌

ఐసీఐసీఐ, యాక్సిస్‌, ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లతోపాటు జియో పేమెంట్స్‌ బ్యాంక్‌తో వాట్సప్‌ అనుసంధానంగా పనిచేయనున్నది. దీంతో యూపీఐ ఆధారిత యాప్‌తో ఇప్పుడున్న ఇతర డిజిటల్‌ పేమెం ట్స్‌ యాప్‌ల తరహాలోనే వాట్సప్‌ నుంచీ ఇతరులకు, దుకాణదారులకు ఇతరత్రా అన్నిచోట్ల నగదు లావాదేవీలు జరుపవచ్చ‌ని ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు.

ఈ స్టెప్స్ ఫాలో అవండి..

వాట్సాప్‌ ద్వారా దేశంలోని దాదాపు140 బ్యాంకు ఖాతాల ద్వారా పేమెంట్స్‌ చేసుకోవచ్చు. అంతేకాదు పది ప్రాంతీయ భాషల్లో వాట్సాప్‌ పేమెంట్స్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. పేమెంట్స్‌ ఎలా చేసుకోవాలంటే…!

– మీ బ్యాంక్‌ ఖాతాకు లింక్‌ అయిన ఫోన్ నంబర్‌, మీ వాట్సాప్‌ అకౌంట్ ఫోన్ నంబర్‌ ఒకటే అయిండాలి.

– వాట్సాప్‌ సెట్టింగ్స్‌లో పేమెంట్స్‌ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే న్యూ పేమెంట్, యాడ్‌ న్యూ పేమెంట్ మెథడ్‌ అని రెండు రకాల ఆప్షన్లు కనిపిస్తాయి.

– వాటిలో యాడ్ న్యూ పేమెంట్‌ మెథడ్‌పై క్లిక్‌ చేస్తే యాక్సెప్ట్‌ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని ఓకే చేస్తే మీకు బ్యాంకుల లిస్ట్ కనిపిస్తుంది.

– అందులో ఖాతా ఉన్న బ్యాంక్‌ సెలెక్ట్ చేస్తే ఎస్సెమ్మెస్‌ ద్వారా వెరిఫికేషన్‌ చేయమని అడుగుతుంది. దానిని ఓకే చేసి మీ బ్యాంక్‌ ఖాతా వివరాలు నమోదు చేయాలి.

– తర్వాత నుంచి మీరు వాట్సాప్‌లో నగదు చెల్లింపులు చెయ్యొచ్చు.

Leave A Reply

Your email address will not be published.