ముంబ‌యి: రైలులో యువతిపై అత్యాచారం.. ఆపై నెట్టివేత

ముంబయి : 25 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసి..రైలులో నుండి తోసివేసిన ఘటన మహారాష్ట్రలోని నవీ ముంబయిలో చోటుచేసుకుంది. వశి రైల్వే స్టేషన్‌ సమీపాన ఉన్న ట్రాక్‌పై అపస్మారక స్థితిలో పడి ఉన్న యువతిని గుర్తించిన అధికారులు ఆమెను రక్షించారు. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం థానే జిల్లాలోని టిట్వాలా నివాసి అయిన యువతి..ముంబయిలోని పోవారులో పనిచేస్తుంటారు. వారం ఒకసారి తన సొంత ఇంటికి వెళ్లి వస్తుంటారు. ఆ విధంగా గత ఆదివారం ఇంటికి వెళ్లి..మరుసటి రోజు పోవారుకి వచ్చేసింది. కాగా, తాను ఇంటి నుండి తిరిగి వచ్చినప్పటికీ..ఎటువంటి సమాచారం తల్లిదండ్రులకు తెలియలేదు. మంగళవారం సాయంత్రం ఉదయం 6 గంటల సమయంలో వశీ రైల్వే బ్రిడ్జి వద్ద పట్టాలపై ఆ యువతి అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని రైల్వే సిబ్బంది చూశారు. పై అధికారులకు సమాచారం ఇవ్వగా..ఆ యువతిని రక్షించి..ప్రాథమిక చికిత్స నిమిత్తం తొలుత నవీ ముంబయి ఆసుపత్రిలో చేర్చారు. మెరుగైన చికిత్స కోసం ముంబయిలోని జెజె ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో కోలుకుంటుందని, మాట్లాడే పరిస్థితిలో లేదని తెలిపారు. అయితే ఆమెపై అత్యాచారం జరిగినట్లు తేలిందని, ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు రైలులో తోసేసేందుకు ప్రయత్నం జరిగి వుండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.