మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కారు జోరు

2 కార్పొరేష‌న్లు, 5 మున్సిపాలిటీలు కైవ‌సం

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీలో మ‌రోసారి ఊపు వ‌చ్చింది.. నాగార్జున‌సాగ‌ర్ బై పోల్‌లో గ్రాండ్ విక్ట‌రీ కొట్టిన ఆ పార్టీ.. ఇవాళ వెలువ‌డిన మినీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లోనూ తిరుగులేని విజ‌యాన్ని అందుకుంది. గ్రేట‌ర్ వ‌రంగ‌ల్, ఖ‌మ్మం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల‌తో పాటు అచ్చంపేట‌, కొత్తూరు, జ‌డ్చ‌ర్ల‌, న‌కిరేక‌ల్, సిద్దిపేట మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగిరింది.

గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ లో..

వ‌రంగ‌ల్‌ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో మొత్తం 66 డివిజ‌న్ల‌కు ఫ‌లితాలు వెలువ‌డ్డాయి.

టిఆర్ఎస్ పార్టీ 48 డివిజ‌న్ల‌లో

బీజేపీ 10 డివిజ‌న్ల‌లో కాంగ్రెస్ – 4

ఇత‌రులు – 4 స్థానాల్లో గెలిచారు.

మ‌రో ఐదు డివిజ‌న్ల ఫ‌లితాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.

 

ఖ‌మ్మం కార్పొరేష‌న్ లో..

ఖ‌మ్మం కార్పొరేష‌న్ ప‌రిధిలో మొత్తం 60 డివిజ‌న్ల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి.

టీఆర్ఎస్ పార్టీ 43 డివిజ‌న్ల‌లో

కాంగ్రెస్ -09

బీజేపీ -01

ఇత‌రులు -07 డివిజ‌న్ల‌లో గెలుపొందారు.

 

సిద్దిపేట మున్సిపాలిటీ

సిద్దిపేట మున్సిపాలిటీలో మొత్తం 43 వార్డుల‌కు గానూ

టీఆర్ఎస్ పార్టీ 36 వార్డుల్లో

ఒక వార్డులో బీజేపీ

మిగ‌తా ఐదు వార్డుల్లో ఇత‌రులు గెలుపొందారు.

 

అచ్చంపేట మున్సిపాలిటీ

అచ్చంపేట మున్సిపాలిటీ ప‌రిధిలో మొత్తం 20 వార్డులకు గాను

టీఆర్ఎస్ పార్టీ 13 స్థానాల్లో

కాంగ్రెస్ 6 స్థానాల్లో

బీజేపీ ఒక స్థానంలో గెలుపొందారు.

 

జ‌డ్చ‌ర్ల మున్సిపాలిటీ

జ‌డ్చ‌ర్ల మున్సిపాలిటీ ప‌రిధిలో మొత్తం 27 వార్డుల గానూ..

టీఆర్‌ఎస్ 23 వార్డుల్లో

కాంగ్రెస్‌ పార్టీ రెండు

బీజేపీ 2 స్థానాల్లో విజయం సాధించింది.

జడ్చర్ల మున్సిపాలిటీకి ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి.

 

కొత్తూరు మున్సిపాలిటీ

కొత్తూరు మున్సిపాలిటీలోని మొత్తం 12 వార్డుల‌కుగాను

టిఆర్ ఎస్ పార్టీ 7 వార్డుల‌ను

ఐదు వార్డుల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థులు గెలుపొందారు.

 

న‌కిరేక‌ల్ మున్సిపాలిటీ

నకిరేకల్ మున్సిపాటిలో మొత్తం మొత్తం 20 వార్డుల‌కు గాను

టీఆర్ఎస్ 11 వార్డుల‌ను

కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలు

ఇత‌రులు 7 స్థానాల్లో గెలుపొందారు.

Leave A Reply

Your email address will not be published.