మృతదేహాన్ని తరలిస్తుండగా ప్రమాదం: ఐదుగురు దుర్మరణం
బదోహి (యుపి): ఉత్తరప్రదేశ్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అసలే ఇంట్లో ఒక మనిషి మృతి చెందిన పుట్టెడు దుఖఃంలో ఉన్న కుటుంబాన్ని విధి మళ్లీ వక్రించింది. యుపిలోని బదోహి జిల్లా గోపాల్‌గంజ్ ఏరియాలో మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌కు చెందిన ఓ కుటుంబం పశ్చిమబెంగాల్లోని అసన్సోల్కు వలస వెళ్లింది. సోమవారం రాత్రి ఆ కుటుంబంలోని వ్యక్తి అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో మృతదేహాన్ని తీసుకుని అంబులెన్స్‌లో రాజస్థాన్‌లోని చిత్తోర్‌కు బయలుదేరారు. అంబులెన్స్
మంగళవారం ఉదయం యూపీలోని గోపాల్‌గంజ్ ప్రాంతానికి చేరుకునే సరిగికి అక్కడ విపరీతపైన పొగమంచుతో రోడ్డు కనిపించకుండా పోయింది. దీంతో ముందు వెళ్తున్న ట్రక్కును వీరి అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ ఘటనలో అంబులెన్స్‌లో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సహా అంబులెన్స్ డ్రైవర్ మృతిచెందాడు. ఈ ఘటనపై యుపి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.