ప్ర‌యాగ్ రాజ్‌లో పోటెత్తిన భ‌క్త‌జ‌నం

ప్ర‌యాగ్‌రాజ్ (CLiC2NEWS): యుపిలోని ప్ర‌యాగ్‌రాజ్‌కు ఆదివారం భ‌క్తులు భారీగా పోటెత్తారు. మౌని అమావాస్య ను పుర‌స్క‌రించుకుని భ‌క్తులు భారీగా త‌ర‌లివస్తున్నారు. ఈ సంద‌ర్భంగా త్రివేణి సంగ‌మం వ‌ద్ద పుణ్య‌స్థానాలు ఆచ‌రిస్తున్నారు. తెల్ల‌వారు జాము నుంచి మొద‌లైన భ‌క్తుల రాక‌తో దాదాపు 1.3 కోట్ల మంది పుణ్య‌స్థానాలు ఆచ‌రించిన‌ట్లు అధికారులు అంచనా వేశారు.

భ‌క్తుల రాక‌ను ముందుగానే అంచ‌నా వేసిన అధికారులు ప‌విత్ర‌స్థానాల కోసం మొత్తం 12,100 అడుగుల పొడ‌వైన స్నాన‌పు ఘాట్‌ల‌ను నిర్మించామ‌ని తెలిపారు. అలాగే ప్ర‌జ‌ల‌కు ప్రాథ‌మిక సౌక‌ర్యాల‌ను స‌మ‌కూర్చిన‌ట్లు తెలిపారు. వైద్య నిపుల‌ను అందుబాటులో ఉంచారు. ఎలాంటి అవాంచ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా పోలీసులు త‌గిన చ‌ర్య‌లు తీసుకున్నారు. భ‌క్తులు భ‌ద్ర‌తా నియ‌మాలు పాటించి అధికారులకు సహ‌క‌రించాల‌ని వారు విజ్ఞప్తి చేశారు.

 

Also Read: `మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌ గారు` .. `విక్ట‌రీ` సెల‌బ్రేష‌న్స్‌! (images)

2 Comments
  1. […] ప్ర‌యాగ్ రాజ్‌లో పోటెత్తిన భ‌క్త‌జ‌… […]

  2. […] ప్ర‌యాగ్ రాజ్‌లో పోటెత్తిన భ‌క్త‌జ‌… […]

Leave A Reply

Your email address will not be published.