మొబైల్ ఫోన్ల లారీ అప‌హ‌రణ‌

తిరుపతి : చిత్తూరు జిల్లా నగరి సమీపంలో రూ.10 కోట్ల విలువైన సెల్‌ఫోన్లను దుండగులు దొంగిలించారు. ఈ దోపిడీ సినీఫ‌క్కీలో జ‌రిగింది. వివరాల్లోకి వెళితే.. త‌మిళ‌నాడులోని కాంచీపురం శ్రీపెరంబూరు షియోమీ కంపెనీ నుంచి సెల్‌ఫోన్లను ముంబ‌యిలో ఎంఐ సంస్థ గోదాముకు లారీలో తీసుకెళ్తున్నారు. తమిళనాడు-ఎపి సరిహద్లుల్లో మరో లారీతో సెల్‌ఫోన్ల లారీని దుండగులు డీకొీట్టారు. డ్రైవర్‌ను గన్‌తో బెదిరించి, కాళ్లు, చేతులు కట్టేసి సెల్‌ఫోన్ల లారీతో అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం నగరి సమీపంలో సెల్‌ఫోన్లను మరో లారీలో వేసుకొని ఆ లారీని అక్కడే వదిలేసి పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం లారీలో రూ. 12 కోట్ల విలువైన 15 వేల మొబైల్ ఫోన్లు లారీలో త‌ర‌లిస్తున్నారు. మొత్తం దొంగిలించిన 16 పెట్టెల్లో 8 పెట్టెల‌ను తీసుకెళ్లి.. మిగ‌తా 8 పెట్టెల‌ను అక్క‌డే వ‌దిలి వెళ్లిపోయారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. కేసుకు సంబంధించిన మిగ‌తా విష‌యాలు ద్యార్యాప్తు అనంత‌రం మీడియాకు తెలుపుతామ‌ని పేర్కొన్నారు.

 

 

Leave A Reply

Your email address will not be published.