మళ్లీ మొదలైన పుత్తడి పరుగులు
హైదరాబాద్: రెండు రోజుల క్రితం వరకు బంగారం ధరలు తగ్గుదల కనిపించింది. కానీ నిన్న, ఇవాళ మళ్లీ పుత్తడి ధరలు పరుగులు పెడుతున్నాయి. ఈ పెరుగుదలతో పసిడి ప్రియులకు షాక్ ఇవ్వడం మళ్లీ మొదలు పెట్టిందని అంటున్నారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో ముదుపరులు బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో దేశంలో బంగారం ధరలు మళ్ళీ పెరగడం మొదలుపెట్టాయి. నిన్న రూ.800 వరకు పెరిగిన బంగారం ధరలు, ఈరోజు రూ.600కి పైగా పెరిగింది. పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.600 పెరిగి రూ.42,250కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.650 పెరిగి రూ.46,090కి చేరింది. వెండి ధర కూడా భారీగా పెరిగింది. కిలో వెండి ధర రూ.1300 మేర పెరిగి రూ.70,000కి చేరింది.