మ‌హారాష్ట్రలో కొత్త‌గా 2,630 కరోనా కేసులు.. 42 మరణాలు

ముంబ‌యి: మ‌హారాష్ట్రలో గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్తగా 2,630 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. అలాగే కొత్గా క‌రోనా బారిన ప‌డి చికిత్స పొందుతూ 42 మర­ణాలు నమో­ద­య్యాయి. ఈ మేర‌కు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ శ‌నివారం సాయంత్రం హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి మహా­రా­ష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,23,814కు, మర­ణాల సంఖ్య 51,042కు చేరింది. అలాగే గత 24 గంటల్లో 1,535 మంది కరోనా రోగులు కోలు­కుని ఆసు­ప­త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలు­కున్న వారి మొత్తం సంఖ్య 19,27,335కు చేరి­నట్లు ఆ రాష్ట్ర ఆరో­గ్య­శాఖ తెలి­పింది. ప్రస్తుతం రాష్ట్రంలో 44,199 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్ల­డిం­చింది.

Leave A Reply

Your email address will not be published.