యాదాద్రిలో ఘోర రోడ్డు ప్రమాదం
ఒకదానికొకటి ఢీ కొన్న 2 కార్లు, వాటర్ ట్యాంకర్

యాదాద్రది: యాదాద్రి భువనగరి జిల్లా గూడూరు ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీబీనగర్ మండలం గూడూరు వద్ద రెండు కార్లు,ఒక వాటర్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో ఒక కారు పూర్తిగా నుజ్జునుజ్జవగా… మరో కారు కూడా ధ్వంసమైంది. రెండో కారులో ఉన్నవారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
హైదరాబాద్‌కి చెందిన ఆరుగురు వ్యక్తులు గురువారం(డిసెంబర్ 24) ఉదయం ఆలేరులో ఓ వివాహ కార్యక్రమానికి హాజరై సాయంత్రం నగరానికి తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు,ఓ వాటర్ ట్యాంకర్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఇంతలో వెనకాలే వచ్చిన మరో కారు కూడా ఈ రెండు వాహనాలను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. టోల్‌ప్లాజాకు దగ్గరగానే ఈ ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాలరాకపోకలను పునరుద్ధరుంచి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.