యాసిడ్ దాడి బాధితురాలు మృతి

మెద‌క్: జిల్లాలోని అల్లదుర్గం యాసిడ్ దాడి బాధితురాలు కన్నుమూసింది.. టేక్మాల్ మండలం మార్కాపురం తండాకు చెందిన మహిళ పై రెండు రోజుల క్రితం యాసిడ్ దాడి జరిగింది. తీవ్రగాయాలపాలైన ఆమెను మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహిళ చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. అయితే, ఈ ఘటన వెనుక విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు తెలంగాణలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. మెద‌క్ జిల్లాలోని అల్లాదుర్గం మండ‌లం గ‌డిపెద్దాపూర్‌లో మ‌హిళ‌పై యాసిడ్ దాడి చేసి పారిపోయాడు ఓ ప్ర‌భుద్దుడు. ఈ ఘ‌ట‌న సోమ‌వారం తెల్ల‌వారుజామున చోటు చేసుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు. యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డ్డ బాధితురాలిని హైద‌రాబాద్ ఉస్మానియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. బాధితురాలిని టేక్మాల్ మండ‌లం అంతాయిప‌ల్లి తండా వాసిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న అల్లాదుర్గం పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

మరోవైపు మహిళపై జరిగిన దాడికి డబ్బు వివాదమే కారణమని తేల్చారు. బాధితురాలికి పశువుల వ్యాపారి సాదత్ తో డబ్బుల విషయంలో వివాదం జరిగింది. అతను డబ్బులు ఇవ్వనందుకు గొడవ పడింది. ఈ క్రమంలోనే యాసిడ్ పోసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.