యుఎస్‌లో SP బాలు పాటకు పట్టాభిషేకం

హైదరాబాద్‌ (CLiC2NEWS): వంశీ గ్లోబల్ అవార్డ్స్ ఇండియా – తెలుగు కళాసమితి ఒమన్‌, సంతోషం ఫిలిం న్యూస్ – శారద ఆకునూరి అమెరికా ఆధ్వర్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 75 వ జయంతి సందర్భంగా 10 మంది గాయకులచే 75 పాటలతో బాలు పాటకు అమెరికాలో పట్టాభిషేకం జరిగింది. ఆదివారం 13 జూన్ సాయంత్రం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 :00 గంటలకు టెక్సాస్ /హ్యూస్టన్ అంతర్జాలం వేదికగా అమెరికా గాన కోకిల శారద ఆకునూరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి అతిథులుగా సినీ దర్శకులడు రేలంగి నరసింహారావు, సినీ సంగీత దర్శకులు సాలూరి వాసు రావు, మాధవ పెద్ది సురేష్, వీణాపాణి, సినీ గీత రచయతలు భువన చంద్ర, రవిప్రకాష్, యూకే నుంకచి డా.నగేష్ చెన్నుపాటి, సురేష్ కొండేటి, ఒమన్ నుంచి, హరి వేణుగోపాల్, వంశీ రామరాజు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.