యుపి ప్రమాదంలో 21కి చేరిన మృతుల సంఖ్య

ఘజియాబాద్: ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా మురాద్‌నగర్‌లో శ్మశాన వాటిక భవనం పైకప్పు కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 21 మందికి చేరింది. ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
యూపీ: శ్మశానవాటిక పైకప్పు కూలి 18 మంది దుర్మరణం
ఘటన తీవ్ర విచారకరం : రాష్ట్రపతి
మురాద్‌నగర్ ఘటన తీవ్ర విచారకరమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు.
मुरादनगर, गाजियाबाद स्थित श्मशान में छत गिरने की घटना अत्यन्त दुखद है I मृतकों के परिवार जन को मेरी शोक संवेदनाएं !
मैं प्रार्थना करता हूं कि इस दुर्घटना में आहत लोग शीघ्र स्वस्थ हों I स्थानीय प्रशासन राहत और सहायता हेतु कार्यरत है I— President of India (@rashtrapatibhvn) January 3, 2021