యూపీలో మినీ బ‌స్సు – ట్ర‌క్కు ఢీ : 10 మంది మృతి

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మోర్దాబాద్ – ఆగ్రా ర‌హ‌దారిపై బ‌స్సు – ట్ర‌క్కు ఢీకొన్నాయి. శ‌‌నివారం ఉద‌యం చోటుచేసుకున్న ఈ ప్ర‌మాదంలో బ‌స్సులో ప్ర‌యాణిస్తున్న ప‌ది మంది అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో 10 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కాగా ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సిఉంది.

ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు రూ. 2 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం ప్ర‌క‌టించారు. క్ష‌త‌గాత్రుల‌కు రూ. 50 వేలు చొప్పున ప్ర‌క‌టించారు.

 

 

 

Leave A Reply

Your email address will not be published.