రాజశేఖర్‌‌ ఆరోగ్య పరిస్థితిపై చిరంజీవి ట్వీట్‌

రాజశేఖర్ చికిత్సకు స్పందిస్తున్నారు: సిటీ న్యూరో సెంటర్

హైద‌రాబాద్: టాలీవుడ్ హీరో రాజ‌శేఖ‌ర్ కుటుంబం కొవిడ్ -19 బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. కాగా తన తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి వివరిస్తూ శివాత్మిక గురువారం ఉదయం ఓ ట్వీట్ చేసింది. తన తండ్రి గురించి అందరూ ప్రార్థనలు చేయాలని కోరింది. ఈ ట్విట్‌తో అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఆతర్వాత కాసేపటికే నాన్న బాగానే ఉన్నారంటూ మరో ట్వీట్‌ చేసింది. ఈ నేపథ్యంలో శివాత్మిక ట్వీట్‌పై మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. రాజశేఖర్‌ త్వరగా కోలుకొవాలని ఆశిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. ‘ప్రియమైన శివత్మికా మీ ప్రేమగల నాన్న, నా సహా నటుడు, నా స్నేహితుడు రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన కోసం, మీ కుటుంబం కోసం ప్రార్థనలు చేస్తూనే ఉంటాం. ధైర్యంగా ఉండు’ అని చిరంజీవి ట్వీట్‌ చేశారు.

త‌ప్ప‌క‌చ‌ద‌వండి: పుకార్లు న‌మ్మొద్దు..

రాజశేఖర్ చికిత్సకు స్పందిస్తున్నారు: సిటీ న్యూరో సెంటర్
సినీ నటుడు రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని సిటీ న్యూరో సెంటర్ తెలిపింది. రాజశేఖర్ కోవిడ్ చికిత్స కోసం సిటీ న్యూరో సెంటర్‌లో జాయిన్ అయ్యారు. తాజాగా హాస్పిటల్ యాజమాన్యం రాజశేఖర్ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. రాజశేఖర్ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని, వెంటిలేటర్ అవసరం లేకుండానే చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.