రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ నిరాహార దీక్ష
ఢిల్లీ: రాజ్యసభలో వ్యవసాయ బిల్లుపై చర్చ సందర్భంగా సభ్యుల ప్రవర్తన తనను తీవ్ర మానసిక వేదనకు గురి చేసిందంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ లేఖ రాశారు. ఈ నెల 20న వ్యవసాయ బిల్లుల ఆమోదం సమయంలో విపక్ష సభ్యులు దురుసుగా ప్రవర్తించారని లేఖలో పేర్కొన్నారు. ఎంపీల తీరుకు నిరసనగా ఈరోజు ఉదయం నుంచి 24 గంటలు నిరాహార దీక్షకు దిగినట్లు పేర్కొన్నారు. రాజ్యసభలో ఆదివారం నాటి పరిణామాలతో గత రెండు రోజులుగా నిద్రకూడా పట్టడం లేదని తెలిపారు. సభ్యుల తీరుతో సభకు, సభాపతి స్థానానికి ఊహించలేని స్థాయిలో నష్టం జరిగిందని లేఖలో పేర్కొన్నారు. ససభలో పరిణామాలు తనను మానసిక వేదనకు గురిచేశాయనీ, దీంతో రాత్రి నిద్ర కూడా పట్ట లేదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం పేరిట గౌరవ సభ్యులు హింసాత్మకంగా వ్యవహరించారంటూ ఆరోపించారు. తన నిర్ణయం వారిలో “స్వీయ శుద్దీకరణ” భావనను ప్రేరేపిస్తుందని భావిస్తున్నానన్నారు. అంతేగాక తాను లోక్ నారాయణ్ జయప్రకాశ్ నారాయణ్ జన్మించిన గ్రామంలో పుట్టానని… ఆయన స్ఫూర్తితో పెరిగానని చెప్పుకొచ్చారు.
(రాజ్యసభ నుండి వాకౌట్ చేసిన ప్రతిపక్షాలు)

మంగళవారం ఉదయం టీ తీసుకెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచిన డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్
ఇదిలా ఉంటే … పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలుపుతున్న ఎంపీలకు ఇవాళ ఉదయం టీ తీసుకెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు డిప్యూటీ చైర్మన్. ఈ పరిణామానికి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఎంపీలలో పశ్చాత్తాపం కోసం, ఆత్మశుద్ధి కోసం తాను ఈ విధం చేశానని ఆయన తెలిపారు. అయితే రైతులకోసం ఉద్యమిస్తాం..పార్లమెంటు హత్యకు గురైందనే ప్లకార్డులతో నిరసనను కొనసాగిస్తున్న ఎంపీలు మాత్రం “టీ దౌత్యాన్ని” నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. రైతు వ్యతిరేకి అంటూ ఆయనను దుయ్యబట్టారు. దీంతో తాను కూడా ఒకరోజు నిరసన దీక్ష చేస్తానని డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ ప్రకటించడం విశేషం. వ్యవసాయ బిల్లులపై జరిగిన చర్చలో విపక్ష ఎంపీలు సభలో అనుచితంగా ప్రవర్తించారని రాజ్యసభ హరివంశ్ ఆరోపించారు. ఎంపీల ప్రవర్తనకు నిరసనగా తాను ఇవాళ ఉదయం నుంచి 24 గంటలు నిరాహార దీక్ష చేపడుతున్నట్టు వెల్లడించారు. దీనికి సంబంధించి ఆయన రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడుకు ఒక లేఖ రాశారు. సభలో పరిణామాలు తనను మానసిక వేదనకు గురిచేశాయనీ, దీంతో రాత్రి నిద్ర కూడా పట్ట లేదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం పేరిట గౌరవ సభ్యులు హింసాత్మకంగా వ్యవహరించారంటూ ఆరోపించారు. తన నిర్ణయం వారిలో “స్వీయ శుద్దీకరణ” భావనను ప్రేరేపిస్తుందని భావిస్తున్నానన్నారు. మరోవైపు తనపై దాడిచేసి, అవమానించిన వారికి వ్యక్తిగతంగా టీ ఆఫర్ చేయడం గొప్ప విషయమంటూ హరివంశ్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలుకురిపించారు. ఆయన ఔదార్యం, శైలి ఆదర్శప్రాయం, ప్రజాస్వామ్యానికి ఇది చక్కటి సందేశం అంటూ ట్వీట్ చేశారు.
हर किसी ने देखा कि दो दिन पहले लोकतंत्र के मंदिर में उनको किस प्रकार अपमानित किया गया, उन पर हमला किया गया और फिर वही लोग उनके खिलाफ धरने पर भी बैठ गए।
लेकिन आपको आनंद होगा कि आज हरिवंश जी ने उन्हीं लोगों को सवेरे-सवेरे अपने घर से चाय ले जाकर पिलाई।
— Narendra Modi (@narendramodi) September 22, 2020