రానా `అరణ్య` ట్రైలర్‌

వైవిధ్య‌మైన పాత్ర‌లు ఎంచుకోంటూ అభిమానుల‌ను అల‌రిస్తూ వ‌స్తున్నాడు రానా దగ్గుబాటి. ఆయ‌న‌ కథానాయకుడిగా ప్రభు సాల్మన్‌ దర్శక‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం ‘అర‌ణ్య’‌. ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విష్ణు విశాల్‌, జోయా హుస్సేన్‌ ప్రధాన పాత్రల్ని పోషించారు. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదాపడిన ఈ సినిమాను మార్చి 26న విడుదల చేయబోతున్నారు. రానా సరికొత్త పాత్రలో నటిస్తోన్న సినిమా ట్రైల‌ర్‌ను తాజాగా విడుదల చేశారు.
“ఏనుగులు మ‌న‌కంటే ఎంతో తెలివైన‌వి. ఎంతో భావోద్వేగం క‌ల‌వి..` అంటూ మొద‌ల‌య్యే ఈ ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగా సాగింది.
`ఏదైతే జ‌ర‌గ‌కూడ‌ద‌ని కోరుకున్నానో అదే జ‌రిగిందే` అని ఆవేద‌న‌తో చెప్పే రాణా మాట‌లు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి.
ఈ చిత్రంలో రానా అడవిలో నివసించే మావటి వాడిగా ఏనుగులను రక్షించే పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాని హిందీలో ‘హాథీ మేరే సాథీ’, తమిళంలో ‘కాదన్‌’ పేరుతో విడుదల చేయనున్నారు. శాంత‌ను సంగీతం అందిచారు.

Leave A Reply

Your email address will not be published.