రికవరీ రేటు 88.26%
భారత్‌లో 75 లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: అత్యధిక కేసుల (83,87,799)తో అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. భారత్ రెండో స్థానం(75,50,273)లో కొనసాగుతోంది. దేశంలో కరోనా రోజురోజుకి పెరిగిపోతోంది. కేసులు పెరిగినప్పటికి దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 88.26 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం హెల్త్‌బులిటెన్‌లో తెలిపింది. గడిచిన 24 గంటల్లో 55,722 పాజిటివ్ కేసులు నమోదవడంతో 75 లక్షల మార్కుని దాటింది. వైరస్ బాధితుల్లో తాజాగా 579 మంది మృతి చెందడంతో ఆ మొత్తం సంఖ్య 1,14,610 కు చేరింది. దేశ వ్యాప్తంగా మరో 66,399 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 66,63,608. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కేసుల సంఖ్య 7,72,055. మొత్తం పాజిటివ్ కేసుల్లో 10.23 శాతం యాక్టివ్ కేసులున్నాయని వెల్లడించికంది. మరణాల రేటు 1.52 శాతానికి తగ్గిందని తెలిపింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8,59,876 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. మొత్తం పరీక్షల సంఖ్య 9,50,83,976 కు చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.