రూ.కోటికి పైగా స్వాహా!

తూర్పుగోదావరి: స‌ర్కార్ అధికారుల అక్ర‌మ‌లకు అడ్డుక‌ట్ట వేయ‌డానికి ఎన్ని చ‌ర్య‌లు తీసుకున్నావారి ఆగ‌డాలు ఆగ‌డం లేదు.. ఈ మ‌ధ్య‌నే తెలంగాణ‌లో ఓ త‌హ‌సీల్దార్ భారీ అక్ర‌మ సంపాద‌న తెలిసిందే.. తాజాగా మ‌రో ఉద్యోగా ఏకంగా రూ. కోటికి పైగా బొక్కేశాడు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం లాలాచెరువు పంచాయతీలో పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న వెంకటేశ్వరరావు చేతివాటాన్ని ప్రదర్శించాడు. పంచాయతీకి ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన రూ.కోటికి పైగా మొత్తాన్ని స్వాహా చేశాడు. వివరాల్లోకి వెళితే.. రాజానగరం మండలం లాలాచెరువు హౌసింగ్‌ బోర్డు కాలనీకి పంచాయతీ కార్యదర్శిగా పని చేసిన దాసరి వెంకటేశ్వరరావు 2019 జూలైలో కడియం మండలం కడియపులంక పంచాయతీకి బదిలీపై వెళ్లారు. ఆయన ఆటు వెళ్లగానే లాలాచెరువుకు ఆయన స్థానంలో కొత్త కార్యదర్శిగా భాస్కరరావును నియమించారు. అయితే అప్పటి నుంచి వెంకటేశ్వరరావు భాస్కరరావుకు బాధ్యతలు అప్పగించకుండా అదిగో, ఇదిగో అంటూ నెలల తరబడి కాలయాపన చేశారు. ఈ విషయాన్ని భాస్కరరావు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో అనుమానం వచ్చి రికార్డులను పరిశీలించాలని ఆదేశించారు. దీంతో ఆయన చేసిన అక్రమాలు వెలుగు చూశాయి. సుమారు రూ.ఒక కోటీ ఆరు లక్షల వరకూ అవినీతికి పాల్పడిన ఆ ఉద్యోగికి పలుమార్లు జారీ చేసిన షోకాజ్‌ నోటీసుల ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం ప్రాథమికంగా రూ.57,27,354 దుర్వినియోగమైనట్టు గత నెల 20న తుది నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు అందజేశారు. వివరాల్లోకి వెళ్తే… రాజానగరం మండలం లాలాచెరువు హౌసింగ్‌ బోర్డు కాలనీకి పంచాయతీ కార్యదర్శిగా పని చేసిన దాసరి వెంకటేశ్వరరావు జూలై 2019లో కడియం మండలం, కడియపులంక పంచాయతీకి బదిలీపై వెళ్లారు.

ఇలా బదిలీ అయిన కార్యదర్శి తన స్థానంలో వచ్చిన కొత్త కార్యదర్శి భాస్కరరావుకు బాధ్యతలు అప్పగించడం పరిపాటి. కానీ వెంకటేశ్వర రావు ఆ విధంగా చేయకుండా నెలల తరబడి ఇదిగో వస్తా, అదిగో వస్తానంటూ కాలయాపన చేయడంతో అనుమానం వచ్చిన భాస్కరరావు విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో రికార్డులను పరిశీలించాలని రాజమహేంద్రవరం డీఎల్‌పీఓ ఆదేశించడంతో పంచాయతీకి వచ్చిన నాటి నుంచి పూర్తి స్థాయిలో రికార్డులను భాస్కరావు పరిశీలించగా అక్రమాలు బయటపడ్డాయి. పంచాయతీకి ప్రజలు చెల్లించిన వాటర్‌ ట్యాక్స్, హౌస్‌ ట్యాక్స్‌ల ద్వారానే సుమారు రూ.1.06 కోట్ల అవినీతి జరిగినట్టుగా రికార్డుల ద్వారా తేలడంతో డీఎల్‌పీఓ ద్వారా జిల్లా పంచాయతీ అధికారి దృష్టికి తీసుకువెళ్లారు.

సుమారు రూ.1.06 కోట్లు అవినీతి జరిగినట్లు తేలింది. పరిశీలనకు నియమించిన ప్రత్యేక బృందం నివేదిక ప్రకారం.. అవినీతికి పాల్పడిన వెంకటేవ్వరరావుకు తప్పు సరిచేసుకునేందుకు అవకాశం ఇవ్వడంతో రూ.26,85,562కు బిల్లులు తీసుకువచ్చి అందజేశాడు. కాగా, మిగిలిన రూ.57,27,354 దుర్వినియోగం అయినట్లు నివేదికను జిల్లా పంచాయతీ అధికారికి అందజేశారు. ఇదిలా ఉండగా, వెంకటేశ్వరరావు లాలాచెరువుకు రాకముందు కోరుకొండ మండలం గాడా, బూరుగుపూడి పంచాయతీలలో కూడా కార్యదర్శిగా పనిచేశాడు. అక్కడ కూడా ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడు దాసరి వెంకటేశ్వరరావు లాలాచెరువు హౌసింగ్‌ బోర్డు కాలనీ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలోనే దివాన్‌చెరువు పంచాయతీకి కూడా ఇన్‌చార్జిగా వ్యవహరించారు. ఆదాయ వనరులు పరిమితంగా ఉండే లాలాచెరువు హౌసింగ్‌ బోర్డు పంచాయతీలోనే ఇంత అవినీతికి పాల్పడితే ఆదాయ వనరులు అపారంగా ఉన్న దివాన్‌చెరువు పంచాయతీలో ఏమేరకు అవినీతికి పాల్పడి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.