రూ.1.5 కోట్లు విరాళం ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌

హైద‌రాబాద్ః భాగ్య‌న‌గ‌రంలో కురిసిన భారీ వ‌ర్షాల‌కు న‌గ‌రం అత‌లాకుత‌ల‌మైన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి ఇంకా ప‌లు కాల‌నీ వాసులు స‌హాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. వ‌ర్షం ప‌డితే చాలు జ‌నం భ‌యాందోళ‌న‌ల‌కు లోన‌వుతున్నారు. ముంపు బాధితుల‌ను ఆదుకొనేందుకు సిఎం కెసిఆర్ సాయంగా రూ. 550 కోట్లు విడుద‌ల చేశారు. బాధితుల‌ను ఆదుకునేందుకు దాత‌లు ముందుకురావాల‌ని సిఎం కెసిఆర్‌ స్వయంగా పిలుపునిచ్చారు. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, ప‌లు సంస్థ‌లు, ప్ర‌ముఖులు, సినీ ఇండ‌స్ట్రీకి సంబంధించిన వారు ప‌లువురు ముందుకు వ‌స్తున్నారు.

త‌ప్ప‌క‌చ‌ద‌వండిః చిరు, మ‌హేష్ చెరో కోటి విరాళం

తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా తన వంతు సహాయం అందించేందుకు ముందుకొచ్చాడు. తెలంగాణలో వరద నష్టానికి సాయంగా సీఎం రిలీఫ్ ఫండ్ కి రూ.1.5 కోట్లు విరాళాన్ని ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం `రాధేశ్యామ్` షూటింగ్ నిమిత్తం ఇటలీలో ఉన్నాడు. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‍ప్రభాస్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. కాగా ఇప్ప‌టికే టాలీవుడ్ నుంచి ఇప్పటికే మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు చెరో కోటి రూపాయలను విరాళంగా ప్రకటించారు. వీరితో పాటు అక్కినేని నాగార్జున రూ.50 లక్షలు, జూనియర్‌ ఎన్‌టీఆర్‌ రూ.50 లక్షలు, విజయ్‌ దేవరకొండ రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.