రూ.2000 పెరిగిన వెండి ధర
హైదరాబాద్ (CLiC2NEWS): దేశీయంగా బంగారం, వెండి ధరలు మంగళవారం పుంజుకున్నాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర దిల్లీలో రూ.300కి పైగా పెరిగింది. వెండి ధర కిలో రూ.73 వేల పైకి చేరింది. బంగారం, వెండి ధరలు మంగళవారం భారీగా పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.333 పెరిగి.. రూ.47,833 వద్దకు చేరింది. ఇంటర్నేషనల్ మార్కెట్‌లలో విలువైన లోహాల ధరలు స్వల్పంగా పెరుగడమే దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరుగడానికి కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
ఇక వెండి ధరలు కూడా ఇవాళ భారీగా పెరిగాయి. ఢిల్లీలో ఇవాళ కిలో వెండి ధర రూ.2,021 పెరిగి రూ.73,122కు చేరింది. క్రితం ట్రేడ్‌లో కిలో వెండి ధర రూ.71,101 వద్ద ముగిసింది. కాగా, అంతర్జాతీయ మార్కెట్‌లలో ఇవాళ ఔన్స్ బంగారం ధర 1,869 అమెరికన్ డాలర్‌లు, ఔన్స్ వెండి ధర 28.48 అమెరికన్ డాలర్‌లు పలికింది.