రూ.70లక్షల లంచం డిమాండ్ కేసు.. వెలుగులోకి కీలక అంశలు..

హైదరాబాద్ (CLiC2NEWS): ఇటీవల హైదరాబాద్ ఆదాయపు పన్ను కమిషనర్ జీవన్‌లాల్ రూ.70లక్షలు లంచం తీసుకుంటూ సిబిఐకి చిక్కిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముంబయికి చెందిన ఎన్‌డిడబ్ల్యు డెవలప్ మెంట్ కార్పొరేషన్ నుండి రూ.2.5 కోట్ల వలువైన ప్లాట్‌ను లంచంగా తీసుకున్నట్లు సమాచారం. అ ప్లాట్ ఖమ్మం జిల్లాకు చెందిన బినామి దండెల్ వెంకటేశ్వరలు పేరిట రిజిస్ట్రేషన్ చేయించినట్లు గుర్తించారు. అంతేకాకుండా ముంబయిలోని మరో రెండు సంస్థల నుండి రూ.35 లక్షలు లంచం తీసుకున్నట్లు సమాచారం,. ఈ సొ్మును హవాలా ద్వారా స్వీకరించినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసు విషయంలో మొత్తం 15 మందిపై సిబిఐ కేసులు నమోదు చేసింది. లంచం తీసుకున్న వారితో పాటు ఇచ్చిన వారిని కూడా నిందితులుగా చేర్చారు.