రెండురోజుల్లో తెలంగాణకు 7.5 లక్షల డోసులు!
హైదరాబాద్: ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా తయారుచేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్లు రెండురోజుల్లో 7.5 లక్షల కరోనా టీకా డోసులు రాష్ర్టానికి రానున్నాయని సమాచారం. వీటిని ముందుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 3 లక్షల మంది వైద్యసిబ్బంది వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాక్సినేషన్ తేదీ ఖరారు కాగానే వీరందరికీ టీకాలు వేస్తారు. కాగా టీకా పంపిణీలో ఎదురయ్యే సవాళ్లను తెలుసుకొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో డ్రైరన్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఏర్పాట్లు పూర్తిచేశారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు డ్రైరన్‌ను శుక్రవారం ఒక్కరోజుకే పరిమితంచేశారు. మరోవైపు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గురువారం అన్ని రాష్ర్టాల వైద్యారోగ్యశాఖ మంత్రులతో ఆన్లైన్ సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభించే తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది.