రెండ్రోజుల్లో ఖా‌తాల్లో రూ.2,000 చొప్పున జ‌మ‌

రైతుల‌కు కేంద్రం తీపి క‌బురు..

న్యూఢిల్లీ: రైతన్న‌ల‌కు ‌కేంద్ర స‌ర్కార్‌ తీపి క‌బురు చెప్పింది. పీఎం కిసాన్ స‌మ్మాన్ నిధి ప‌థ‌కం కింద మ‌రో విడ‌త‌ ఒక్కో రైతుల‌ ఖాతాలో రూ.2000 చొప్పున జ‌మ చేయ‌నున్న‌ట్లు తెలిపింది. అందుకు అవ‌స‌ర‌మ‌య్యే నిధులను ఈ నెల 25న‌ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా విడుద‌ల చేయ‌నున్నారు. దేశంలో మొత్తం 9 కోట్ల మందికి పైగా ఉన్న‌ రైతులకు మ‌రో విడత‌ ఆర్థిక చేయూత అందించ‌డం కోసం రూ.18,000 కోట్ల‌కుపైగా నిధులను ప్ర‌ధాని నిధులను విడుద‌ల చేయ‌నున్నారు.

ఈ నిధుల విడుద‌ల కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని మోదీ దేశంలోని ఆరు వేర్వేరు రాష్ట్రాల‌కు చెందిన రైతుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ముచ్చ‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా రైతులు త‌మ సాధ‌క‌బాద‌కాల‌ను ప్ర‌ధానితో పంచుకోనున్నారు. పీఎం కిసాన్ స‌మ్మాన్ నిధి ప‌థ‌కం స‌హా, రైతు సంక్షేమం కోసం కేంద్రం చేప‌ట్టిన ఇత‌ర చ‌ర్య‌ల‌పై రైతులు త‌మ అనుభ‌వాల‌ను ప్ర‌ధానికి చెప్పనున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని మోదీతోపాటు కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కూడా పాల్గొన‌నున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.