రేపటినుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు షూరూ..

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో రేపటి (శుక్ర‌వారం) నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. రిజిస్ట్రేషన్లు ఆపాలని ఎప్పుడూ స్టే ఇవ్వలేదని మరోమారు స్పష్టం చేసిన హైకోర్టు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు అనుమతి తెలిపింది. హైకోర్టు ఆదేశాలతో రాష్ట్రంలో రేపటినుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. రేపట్నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని సీఎస్‌ను ఆదేశించారు. దీంతో రేపటినుంచి స్లాట్ల బుకింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ధరణి ద్వారా కాకుండా పాత పద్దతిలో రిజిస్ట్రేషన్లకు హైకోర్టు అనుమతి తెలిపింది. స్లాట్‌ బుకింగ్‌ విధానంతో కంప్యూటర్‌ ఆధారిత పద్దతిలో రిజిస్ట్రేషన్లకు అనుమతిచ్చింది.ఆస్తిపన్ను గుర్తింపు సంఖ్య కచ్చితంగా ఉండాలన్న నిబంధనకు హైకోర్టు అంగీకారం తెలిపింది. ఆధార్‌, కులం, కుటుంబ సభ్యుల వివరాలు అడగబోమని ప్రభుత్వం పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.