రైతు పక్షపాత ప్రభుత్వం…

జగన్ తోనే సంక్షేమం: వ‌్య‌వ‌సాయ మంత్రి క‌న్న‌బాబు

మండపేట:- రైతుపక్షపాత ప్రభుత్వం వైకాపా ప్రభుత్వమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా మండపేట వల్లూరి అప్పారావు ప్రాథమిక పరపతి సంఘం ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రాజ్యసభ సభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎం ఎల్ సి పండుల రవీంద్ర బాబు, వైకాపా ఇంచార్జ్ తోట త్రిమూర్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ స్వామినాధం కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని ఉద్యమాలు ఈ రాష్ర్టంలో చేయాల్సిన అవసరం లేదన్నారు. ముందుగా నే ఇవన్నీ తాము అమలు చేశామన్నారు. టోల్ ఫ్రీ నెంబర్ పెద్ద ఎత్తున ప్రచారం చేయాలన్నారు. మండపేట రైస్ మిల్లు పరిశ్రమ కు పెట్టింది పేరన్నారు. రేపు ఏమి జరుగుతుందో ఆలోచించండీ ఈ రోజే సమస్యకు పరిష్కారం చూపండి అనే ముఖ్యమంత్రి జగన్ సందేశానికి అనుగుణంగా తాము పనిచేస్తున్నామని పేర్కొన్నారు.గోదావరి జిల్లాలు అన్నపూర్ణ లాంటివి, ఇక్కడ వ్యవసాయ రంగంలో మరింతగా అభివృద్ధి చెందేలా తమ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయన్నారు. కడియం నర్సరీ లు, ఆక్వా రంగం అభివృద్ధి కి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ ఏడాది ధాన్యం కొనుగోలు లో పెను సవాళ్లు రాబోతుందని, రంగు మారిన, తేమ శాతం వంటి వాటిపై గందరగోళం లేకుండా అధికారులు వ్యవరించాలని సూచించారు. జేసీ లక్ష్మీ షా మాట్లాడుతూ2016- 2017 లో 12 లక్షల మెట్రిక్ టన్నులు జిల్లా లో కొనుగోలు చేస్తే2018- 2019 లో 18 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామన్నారు. 2019-2020 లో 21.14 లక్షల టన్నులు కొనుగోలు చేశామన్నారు. ప్రతి రైతు కు రైతు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తొలుత ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కన్నబాబు ప్రారంభించగా ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు వేగుళ్ళ పట్టాభి రామయ్య చౌదరి, కర్రీ పాపా రాయుడు, రెడ్డి రాధాకృష్ణ వ్యవసాయ శాఖ జెడి కె ఎస్ వి ప్రసాద్, పౌరసరఫరాల శాఖ మేనేజర్ లక్ష్మణ్ రెడ్డి, సహకార శాఖ డి సి ఓ పాండురంగారావు, డి ఎల్ సి ఓ నాగభూషణం, ఆర్డీవో గాంధీ, తహశీల్దార్ రాజ
రాజేశ్వరరావు, ఎంపిడిఓ ఐదం రాజు, వ్యవసాయ శాఖ ఏ డి సి హెచ్ కెవి చౌదరి, మండపేట మండల వ్యవసాయ శాఖ అధికారి బలుసు రవి,స్థానిక సొసైటీ కార్యదర్శి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.